ఘనంగా తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ 4వ వార్షికోత్సవ వేడుకలు
బదిరుల పాఠశాలలో అల్పాహారం పంపిణీ
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాలుగో వార్షికోత్సవ వేడుకలు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా సూర్యాపేట సమీపంలో గల కాసరబాద్ రోడ్డు లో ఉన్న బదిరుల పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం పంపిణీ,పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ అసోసియేషన్ ముందుకు తీసుకు వెళ్లేందుకు ఇప్పటివరకు సహకరించిన మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అసోసియేషన్ను ట్రేడ్ యూనియన్ స్థాయికి తీసుకు వెళ్లేందుకు అందరూ సహకరించాలని కోరారు. అల్పాహార పండ్ల పంపిణీ కార్యక్రమానికి సహకరించిన జర్నలిస్టులు వంశీకృష్ణ శర్మ కొండా రవి లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు కోశాధికారి కొరివి సతీష్ యాదవ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు దుస్సా చంద్రశేఖర్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుంటి శ్రీనివాస్ సూర్యాపేట జిల్లా కౌన్సిల్ సభ్యులు దేశ గాని వెంకట్ గౌడ్ సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి తిరుపతి శ్రీనివాస్ నియోజకవర్గ నాయకులు యాతాకుల మధుసూదన్ సందీప్ తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY