కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ జన్మదిన వేడుకలు గాయత్రి నగర్ లోని చంద్ర గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ , బాలాజీ నగర్ మాజీ కార్పొరేటర్ బాబురావు హాజరయ్యారు. అలాగే డివిజన్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మాట్లాడుతూ, డివిజన్ నాయకులు, కార్యకర్తలు అందరూ తనను ఎంతగానో ఆదరిస్తూ, అండగా నిలుస్తున్నందుకు తాను ఎంతో రుణపడి ఉన్నానని తెలిపారు. అలాగే ఎప్పుడూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ, అల్లాపూర్ డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండి, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, నాగుల సత్యం, పిల్లి తిరుపతి, జాహేద్ షరీఫ్ బాబా, జ్ఞానేశ్వర్, పార్వతమ్మ, ముత్యాల దుర్గ, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY