ప్రజా సమస్యలే పరిష్కారంగా అభివృద్దే లక్ష్యంగా
ఖాజా నగర్ కాలనీ ప్రజా సమస్యలపై పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
124 అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఖాజా నగర్ కాలనీ లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎమ్.సి అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఖాజా నగర్ కాలనీలో డ్రైనేజీ మరియు సీసీ రోడ్లకు సంబందించిన పెండింగ్ వర్క్స్ ఉన్నాయని, వాటిని శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ దృష్టికి మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి శాంక్షన్ చేయించి అతి త్వరలో నిర్మాణ పనులు మొదలుపెడతామని హామీ ఇచ్చారు. కొన్ని చోట్ల విద్యుత్ స్తంబాలు, విద్యుత్ లైట్లు మరియు ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఫినిసింగ్ లు నిర్మించాలని కాలనీ వాసులు తెలుపగా, కార్పొరేటర్ సంబంధిత అధికారులను అదేధించి వెంటనే విద్యుత్ కు సంబందించిన సమస్యలను పరిష్కరించాలని తెలియచేసారు. డివిజన్ సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, దశల వారిగా అభివృద్ధి పనులు చేపడుతామని, కాలనీలో పెండింగ్లో ఉండి అసంపూర్తిగా మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాలనీ వాసులు తన దృష్టికి తీసుకువచ్చిన రోడ్లు, డ్రైనేజీ, త్రాగు నీరు, వీధి దీపాలు, పారిశుద్యం వంటి పెండింగ్ ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని అన్నారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని అన్నారు. అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ తెలియచేసారు.
కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, గోపాల్, షౌకత్ అలీ మున్నా, కైసర్, ఖాజా, సుల్తాన్, ఫిరోజ్, ఎమ్.డి గౌస్, ఎస్.కె గౌస్, మెహబూబ్, నవాజ్, అక్బర్, లింగం, సుధాకర్, సత్తయ్య, రమేష్.
జి.ఎచ్.ఎమ్.సి అధికారులు ఎ.ఇ యుగంధర్ రెడ్డి, ఎస్.ఆర్.పి నాగేశ్వర నాయక్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, వాటర్ వర్క్స్ సూపర్వైజర్ శివ, ఎస్.ఎఫ్.ఎ వెంకటరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
