సింగరేణి బొగ్గు స్కాం బయట పెట్టినందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్…..
సుప్రీంకోర్టు కొట్టేసిన కేసుకు సిట్ నొటిసులా….?
ధర్మబద్ధంగా ఉన్నాం కాబట్టే సిట్ కు హాజరు….హరీష్ రావు.
మాజీ మంత్రి సిద్దిపేట MLA హరీష్ రావు ని సిట్ విచారణ సందర్భంగా BRS పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో వారిని మర్యాదపూర్వకంగా కలిసిన మేడ్చల్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, MLC శంభిపూర్ రాజు , కుత్బుల్లాపూర్ నియోజకవర్గం MLA కేపీ.వివేకానంద మరియు కూకట్ పల్లి MLA మాధవరం కృష్ణారావు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిడ్డా రేవంత్ రెడ్డి..నువ్వు ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని విచారణలకు పిలిచినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు నిన్ను విడిచి పెట్టేది లేదు. నీ తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో నీకు ప్రజలు దిమ్మదిరిగే విధంగా జవాబు చెబుతారు చూస్కో అని అన్నారు. కేసీఆర్ సార్ నాయకత్వంలో రాటు దేరిన కార్యకర్తలం, బయమెరుగని ఉద్యమకారులం మేము అని అన్నారు. మీరెన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసిన ప్రజలు అన్ని గమనిస్తారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు మరియు BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
