అన్నమయ్య జిల్లా మదనపల్లి స్కూల్ అనుమతికి 45,000 లంచం తీసుకుంటుంటే పట్టుకున్నాం : ఎసిబీ డిఎస్పీ
అన్నమయ్య జిల్లా, మదనపల్లె లో గుర్రంకొండ ఏబీసీ స్కూల్ కరస్పాండెంట్ శేషాద్రినాయుడు దగ్గర సోమవారం రూ.45వేలు లంచం తీసుకుంటుంటే పట్టు కున్నామని కడప ఎసిబీ డిఎస్పీ సీతారామారావు, సిఐ నాగరాజా తెలిపారు. స్కూల్ అనుమతికి బాధితుడు మదనపల్లి డీవైఈవో కు ధరఖాస్తు చేశాడని.. ఫైల్ ను పాస్ చేయడానికి జిల్లా విద్యాశాఖ సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాష అలియాస్ మున్నా, ఆ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ రూ.45వేలు లంచం డిమాండ్ చేయడం జరిగిందన్నారు. బాదితుడు లంచం తీసుకొంటూ ఉండగా.. నిందితుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
