డీలర్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లాఅదనపు కలెక్టర్‌కు వినతి
రేషన్ షాపుల్లో తొమ్మిది రకాల సరుకులు సరఫరా చేస్తూ, డీలర్లకు వేతనాలు చెల్లించాలని డిమాండ్
సాక్షిత వనపర్తి
వనపర్తి జిల్లాలో రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్ల అధ్యక్షులు బచ్చురామ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ ను కలిసి సమస్యలతో కూడుకున్న వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లాలో చాలా కాలంగా డీలర్ల వృత్తిని చేపట్టి చాలీచాలని ఆదాయంతో తమ కుటుంబాలను పోషించలేని స్థితిలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని రోజు రోజుకి మార్కెట్లో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కానీ డీలర్ కమిషన్ మాత్రం పెరగడం లేదని దీంతోపాటు ప్రతి నెల రేషన్ షాప్ కిరాయి కరెంటు బిల్లులు హమాలీ చార్జీలు లారీ డ్రైవర్ల ఖర్చులు హెల్పర్ వేతనం ప్రభుత్వం ఇచ్చే కమిషన్‌లో నుంచి చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ పోను డీలర్లకు మిగలడం ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో భాగంగా డీలర్లకు గౌరవ వేతనం కింద 5000 రూపాయలు క్వింటాలకు 300 రూపాయల కమిషన్ ఇస్తామని చెప్పారని కానీ అది ఇంతవరకు అమలు కాలేదని సీఎం ఇచ్చిన హామీని అలాకాకుండా రేషన్ డీలర్లకు కమిషన్‌కు బదులుగా ప్రతినెల గౌరవ వేతనం 30 వేలు ఇవ్వాలని లేదా క్వింటాల్‌కు 300 కమిషన్ ఇస్తూ 9 రకాల నిత్యవసర వస్తువులను సరఫరా చేయాలని అలాగే రేషన్ డీలర్ అకాల మరణం సంభవిస్తే 30,000 దహన సంస్కారాల నిమిత్తం తక్షణ సాయం అందివ్వాలని ఇన్సూరెన్స్ కింద పది లక్షల రూపాయలు అందించ డీలర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోవిడ్ కరోనా సమయంలో మరణించిన రేషన్ డీలర్లకు ప్రభుత్వం వెంటనే ఎక్సిగ్రేసియా ఇవ్వాలని తూకం తక్కువ బియ్యం బస్తాలను వాపస్ తీసుకోవాలని హమాలీ చార్జీలను ప్రభుత్వం భరించాలని రేషన్ షాపుల్లో నెలకొన్న సమస్యలన్నిటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అదనం కలెక్టర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో ప్రభుత్వాన్ని కోరినట్లు వారి తెలిపారు ముందుగా జిల్లాకు అదనపు కలెక్టర్‌గా బదిలీ వచ్చిన కిమ్యానాయక్ను జిల్లా డీలర్లు శాలువా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బచ్చు రాము తోపాటు పెబ్బేరు మండల అధ్యక్షుడు సహదేవుడు కుమార్ వెంకటరెడ్డి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
