కోటపాటి వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర, కోటపాటి, ఇరిగినేని, దారపనేని, బైరెడ్డి, గుర్రం
సాక్షిత కనిగిరి : కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం బొట్లగూడూరు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటపాటి నరసింహారావు శ్రీమతి వెంకట రమాదేవి దంపతుల జేష్ఠ పుత్రుడు చిరంజీవి లోకేష్, పీసీ పల్లి మండలం పిసి పల్లి గ్రామ వాస్తవ్యులు వీరపనేని చెన్నారావు, శ్రీమతి రమణమ్మ దంపతుల ఏకైక కుమార్తె అనూష వివాహ వేడుకలు పామూరు పట్టణంలోని పువ్వాడి కన్వెన్షన్ హాలులో ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకల్లో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, టిడిపి నాయకులు ఇరిగినేని రవీంద్రబాబు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దన్ రావు, కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి, మోపాడు టిడిపి నాయకులు గుర్రం వెంకటేశ్వర్లు పాల్గొని వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకల్లో అడుసుమల్లి నరసింహారావు, యోగానంద్, దేవరపు మాల్యాద్రి,మోపాడు రిజర్వాయర్ నీటి సంఘం చైర్మన్ చుంచు కొండయ్య, వైస్ చైర్మన్ మోరు బోయిన నరసింహారావు, బొట్లగూడూరు మాజీ సర్పంచులు మాలకొండ రాయుడు, విశాలమ్మ, మోపాడు టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు మోరుబోయిన గిడ్డయ్య యాదవ్, డాక్టర్ కోటపాటి చంద్రశేఖర్ ,దారపనేని సుబ్బారావు, యరసింగు రాయుడు, డీఎంకే రాయుడు (చినరాయుడు) అనపర్తి వెంకటేశ్వర్లు, కమ్మ లక్ష్మయ్య చౌదరి, అనపర్తి శశి, రాయవరపు శ్రీకాంత్, పాలపర్తి వెంకటేశ్వర్లు, కోట చిన్న వెంకటేశ్వర్లు, కౌలూరి ఖాజా రహమతుల్లా, తడికమల్ల సుబ్బారావు, కోటపాటి వారి బంధుమిత్రులు, వీరపనేని వారి బంధుమిత్రులు, దేవరపు వారి బంధుమిత్రులు, కమ్మవారి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొని వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
