చీరాల తాలూకా యూనియన్ కొత్త కార్యవర్గం ఏర్పాటు
విడదల మురళీకృష్ణ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నరు
సాక్షిత బాపట్ల జిల్లా :
చీరాలలో చీరాల తాలూకా యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించబడింది.
ఈ సమావేశంలో ఎన్నికల ప్రక్రియ ద్వారా విడదల.మురళీకృష్ణ అధ్యక్షుడిగా, డి. నాగేందర్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా, పి. సాయికుమార్, అబ్రహం కార్యదర్శులుగా, డి. సులోచన, విజయ్, అరుణ ఉప కార్యదర్శులుగా నూతన కార్యవర్గం ఎన్నికైంది.
ప్రకాశం జిల్లా అధ్యక్షులు కె. వెంకటేశ్వర్లు, జి. సుబ్బారాయుడు, జి. యోబు పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి.
ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్. నాగమల్లేశ్వరరావు నూతన కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి చీరాల శేషు బాబు, కె. శ్రీనివాసరావు, జె. శ్రీను, పి. సుధాకర్ హాజరయ్యారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
