అర్హులైన వారందరూ కల్యాణ లక్ష్మీ పథకాన్ని వినియోగించుకోవాలని తెలిపిన నియోజవర్గ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం శ్రీ రామ్ నగర్ పరిధిలోని బేకారి గడ్డ వాసులు మధుపతి ప్రభు లింగం కుమార్తె మధుపతి సంగీత కి రూ. 1,00116/- ల కల్యాణ లక్ష్మి చెక్కును నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి అందజేశారు. అనంతరం హన్మంతన్న మాట్లాడుతూ అర్హులైన వారందరూ కల్యాణ లక్ష్మీ పథకాన్ని వినియోగించుకోవాలని, పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బహదురుపల్లి మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గఫ్ఫార్, ఖలీమ్, అసిఫ్, అహ్మద్ మరియు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
