లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ||
(కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) పలువురు పేదలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ చికిత్సకు సరిపడా స్థోమత లేక కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించగా వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 60,000/- , ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ని మంజూరు చేయించి ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బౌరంపేట్ వాసులు – దుడ్డు నర్సింగ్ రావు కి- రూ. 30,000/- , 126- డివిజన్ జగద్గిరిగుట్ట వాసులు సర్వేపల్లి పద్మ కి రూ. 60,000/- , బాచుపల్లి వాసులు పద్మజ డిక్కల కి రూ. 60,000/- , 132 డివిజన్ సుచిత్ర వాసులకు నారెడ్ల మధుసూదన్ రెడ్డి కి రూ. 60,000/- , బాచుపల్లి వాసులు కమ్మని దామోదర్ కి రూ. 20,000/- CMRF-మంజూరి పత్రాలను (చెక్కులు) అందజేశారు. అనంతరం హన్మంతన్న మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని అలాగే అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
