గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని : రవి నాయక్
….
సాక్షిత | సూర్యాపేట జిల్లా ప్రతినిధి : వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి సాధారణ పరిశీలకులు రవి నాయక్ నిర్వహించారు. కలెక్టరెట్ లోని విసి హాల్ లో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సోమవారం ర్యాండమైజేషన్ జరిపించారు. మూడవ విడత ఎన్నికలు జరిగే చింతలపాలెం, గరిడేపల్లి, హుజూర్నగర్, మట్టంపల్లి, మేళ్లచెరువు, నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో లోని ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు,ఓ.పీ.ఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.
స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, సిబ్బందికి పోలింగ్ విధులను కేటాయించారు. జిల్లాలో మూడవ విడత లో మొత్తం 146 గ్రామ పంచాయతీ ల సర్పంచ్ లకు, 1333 వార్డ్ సభ్యులకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వగా 22 సర్పంచ్ లు, 157 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వడంతో మిగిలిన 124 గ్రామ పంచాయతీల సర్పంచ్, 1176 వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం 30 శాతం రిజర్వ్ సిబ్బంది కలుపుకుని ప్రిసైడింగ్ అధికారులు 1538 ఓ.పీ.ఓలు 2026 పోలింగ్ కోసం ర్యాండమైజేషన్ జరిపారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జడ్పీ సి ఈ ఓ వి వి అప్పారావు,డీపీఓ యాదగిరి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY