సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ గారు..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మంజూరు చేయించిన రూ.4,16,500/- సిఎం రిలీఫ్ ఫండ్ సంబంధిత 12 చెక్కులను లబ్ధిదారులు అందజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉండి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ బుచ్చి రెడ్డి, కొర్ర శంకర్ నాయక్, సాయి యాదవ్, సుధాకర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రాఘవేందర్ గౌడ్, సీనియర్ నాయకులు పాల్పనూరి దర్శన్ రెడ్డి, ఆకుల బాబు, మల్లేష్, సాయి ముదిరాజ్, నిజాంపేట్ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్ మరియు నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
