రోటరీ ఆధ్వర్యంలో ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమం ప్రమోషన్ లాంచ్
మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జర్మనీలో తయారు చేసిన జి.ఈ.ఎం.ఎం.కె–1 కృత్రిమ చేతులను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. స్థానిక గణపతి నగర్లోని వి.జె. డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ డా. ఎస్.వి. రామ్ ప్రసాద్ హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షుడు ప్రెగడ రాజశేఖర్ అధ్యక్షత వహించగా, పి.డి.జి అన్నే రత్న ప్రభాకర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. గతంలో భారత్లో
మొట్టమొదటిసారిగా జర్మనీ నుంచి దిగుమతి చేసిన ఈ కృత్రిమ చేతులు మంగళగిరి రోటరీ క్లబ్ ద్వారా దివ్యాంగులకు అందించబడ్డాయి. ఇప్పుడు మరలా ఈ అవకాశాన్ని కల్పించడంతో అనేక మంది దివ్యాంగుల జీవితాల్లో మార్పు వస్తుందని నిర్వాహకులు తెలిపారు.
డా. రామ్ ప్రసాద్ బ్రోచర్ ఆవిష్కరించి, సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారం అవసరమైన వారికి చేరేలా చేయాలని సూచించారు.
ప్రపంచ శాంతి కోసం ర్యాలీ
ఈ సందర్భంగా రోటరీ సభ్యులు, రోటరాక్టర్లు, విద్యార్థులు కలిసి వి.జె. కళాశాల నుండి శాంతి ర్యాలీ నిర్వహించారు. హిరోషిమా అణు దాడి, పహల్గాం ఉగ్రవాద దాడి లాంటి ఘటనలపై అవగాహన కల్పించేందుకు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని క్లబ్ సెక్రటరీ పారెపల్లి నిరంజన్ గుప్తా పర్యవేక్షించారు. అనేక మంది రోటరీ, రోటరాక్ట్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
