రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీని కలిసిన తుడా చైర్మన్
సాక్షిత ప్రతినిధి – తిరుపతి / విజయవాడ: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ను తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడ) చైర్మన్ “డాలర్స్” దివాకర్ రెడ్డి విజయవాడ లో కలిశారు. ఈమేరకు రాష్ట్ర సచివాలయంలోని ప్రిన్సిపల్ సెక్రటరీ చాంబర్ లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ ను దుశ్శాలువతో సత్కరించి తిరుమల స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం తుడాభివృద్ధిపై చర్చించారు. తుడా లేఔట్స్, శెట్టిపల్లి భూముల సమస్యను, తిరుపతికి ఐకాన్ గా నిర్మిస్తున్న తుడా టవర్స్ వివరాలను ప్రిన్సిపల్ సెక్రెటరీకి వివరించారు. గత జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో “తుడా” నిధులను పూర్తిగా దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం “తుడ” అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. ఇందుకు ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్ స్పందిస్తూ… తుడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
