ప్రశాంతమ్మ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు టిడిపి నాయకులు అండ
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కోవూరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అండగా నిలిచేందుకు టీడీపీ సీనియర్ నాయకులు
కోడూరు కమలాకర్ రెడ్డి ముందుకు వచ్చారు. నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని ఆయన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10 తరగతి చదివే విద్యార్దినీ విద్యార్థుల పరీక్ష ఫీజులకు సంబంధించి 2 లక్షల 96 వేల రూపాయలు ఆయన మండల విద్యాశాఖ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కోడూరు కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం మల్లన్నకు బంగారు రథ బహుకరణ, శ్రీ పుట్టపర్తి సాయిబాబా వారి పాదుకలను జిల్లా ప్రజల సందర్శనకు తీసుకు రావడం, లక్ష దీపోత్సవ నిర్వహణ లాంటి వేమిరెడ్డి దంపతుల ఆధ్యాత్మిక సేవలను కొనియాడారు.ఆస్తి అంతస్తుల కన్నా చదివే ముఖ్యమన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆమె జన్మదినం సందర్భంగా 10 తరగతి చదివే విద్యార్థుల ఫీజులు చెల్లించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
విపిఆర్ విద్య పేరుతో ఎంతోమందికి విద్యాదానం చేస్తున్న ఆమె సేవా కార్యక్రమాల స్ఫూర్తిగా విపిఆర్ అభిమానుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కోడూరు కమలాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ, కోవూరు, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు, బుచ్చిరెడ్డి పాళెం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, నాప వెంకటేశ్వర్లు నాయుడు, ఏటూరి శ్రీహరి రెడ్డి, గుత్తా శ్రీనివాసరావు, చేనేత సంఘ రాష్ట్ర నాయకులు కె వి శేషయ్య, టిడిపి నాయకులు ఇంత మల్లారెడ్డి, మోర్ల మురళి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
