వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హఫీజ్పెట్ కి చెందిన శ్రీ లోకం గోపీనాథ్ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన రూ.60,000/- అరవై వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కును బాధిత కుటుంబానికి అందచేసిన PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని, ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని PAC చైర్మన్ గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. PAC చైర్మన్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.
పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రిలో బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆర్థిక సాయంని అందిస్తుందని దీనిలో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నో వందలాది కుటుంబాలను CMRF ద్వారా ఆదుకున్నామని తెలిపారు. గతంలో ఉన్న బిల్లులకు అనుగుణంగానే ప్రస్తుతం ఆర్థిక సాయం అందిస్తుందని దానిని మరింత పెంచేలా కృషి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి త్వరలోనే కలిసి వినతి పత్రాన్ని అందజేస్తానని ,మరింత ఆర్థిక సహాయం పెంచితే పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని PAC చైర్మన్ గాంధీ అన్నారు.
ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధితు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మారబోయిన రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, జిల్లా గణేష్,MD ఇబ్రహీం, మల్లేష్ యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
