నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తిలో రాష్ట్ర ఆగ్రోస్ కార్పోరేషన్ ఛైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి దారి పొడవునా ఘనస్వాగతం లభించింది.
ఒంగోలులో నేతలు, కార్యకర్తలు.. టంగుటూరు టోల్ గేట్ వద్ద ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు.
కందుకూరు నియోజకవర్గం తెట్టు వద్ద ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు
భారీ గజమాలతో స్వాగతించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
