జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా కొల్లూరు డబల్ బెడ్ రూమ్ సముదాయంలో ప్రచారంలో పాల్గొన్న నర్సారెడ్డి భూపతి రెడ్డి .
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు కొల్లూరు లోని ప్రభుత్వ డబల్ బెడ్ రూమ్ వసతి సముదాయంలో కాలనీవాసులకు సత్వరమే మౌలిక వసతులు కల్పిస్తూ, ప్రధాన సమస్యల పరిష్కారం దిశగా అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. కాలనీలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు పరిష్కారం దిశగా అధికారులతో చర్చించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, ప్రధాన రహదారి నుంచి కాలనీలోకి వెళ్లేచోట ఇన్ అండ్ అవుట్ వేరువేరుగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు రఘురాం రెడ్డి , మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి మరియు పొల్యూషన్ బోర్డ్ మెంబర్ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిరుపేద కుటుంబాలకు సన్న బియ్యం, ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణానికై ఐదు లక్షల రూపాయలు ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం ప్రస్తుత మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
