చండ్రుగొండ : పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిన ఎమ్మెల్యే జారే
సాక్షిత భద్రాద్రి కొత్తగూడెం
చండ్రుగొండ మండలం, చండ్రుగొండ రావికంపాడు, బెండాలపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు.ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన రేషన్ కార్డులను అర్హులైన కుటుంబాలకు పంపిణీ చేశారు.
ఇన్నేళ్లుగా రేషన్ కార్డులకోసం ఎదురుచూస్తున్న పేదలకు ఇది పెద్ద వరంగా మారిందని అన్నారు.
ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలనే ధ్యేయంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేస్తున్న సంక్షేమ పథకాలు పల్లె ప్రజల జీవన ప్రమాణాలాను మెరుగుపరుస్తాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
