అయ్యప్ప మాలధారణతో వస్తే స్కూల్లోకి అనుమతి లేదా

Sakshitha news

అయ్యప్ప మాలధారణతో వస్తే స్కూల్లోకి అనుమతి లేదా?

సెయింట్ మార్టిన్ స్కూల్ యాజమాన్యంపై ఏబీవీపీ ఆగ్రహం.. పాఠశాల ఎదుట ధర్నా!

బాలానగర్: అయ్యప్ప మాలధారణ చేసుకున్న విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించకుండా అడ్డుకోవడంపై బాలానగర్ పరిధిలోని సెయింట్ మార్టిన్ హైస్కూల్ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విద్యార్థులు అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు రావడంతో వారిని లోపలికి అనుమతించేందుకు యాజమాన్యం నిరాకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో సోమవారం పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అయ్యప్ప స్వాములు సైతం ఈ నిరసనలో పాల్గొని పాఠశాల యాజమాన్య వైఖరిని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థుల మధ్య కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడమే సెయింట్ మార్టిన్ పాఠశాల యా…