పేదల ఇళ్లలో పండుగ వెలుగులు నింపేందుకు..రేపు మంత్రి పొంగులేటి పర్యటన

Sakshitha news

పేదల ఇళ్లలో పండుగ వెలుగులు నింపేందుకు..
రేపు మంత్రి పొంగులేటి పర్యటన

  • పాలేరు నియోజకవర్గంలో మూడు మండలాల్లో షెడ్యూల్
  • ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాల్లో పాల్గొననున్న శీనన్న

ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాల్లో దీపావళి పండుగ వెలుగులు నింపేందుకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు (ఆదివారం) పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాల్లో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి బాణాసంచా కాల్చి దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు.
పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఖమ్మం రూరల్ మండలం కామంచికల్‌లో, 9:30 గంటలకు నేలకొండపల్లి మండలం కోరట్లగూడెంలో, 10:30 గంటలకు కూసుమంచి మండలం పాలేరులో జరిగే కార్యక్రమాలకు మంత్రి హాజరవుతారు. మూడు మండలాల్లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మమేకమై వారి ఇళ్లలో దీపావళి సంబరాలను పంచుకోనున్నారు.ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.