వైసిపి వాళ్లు ఓటమి భయంతోనే గొడవలు స్పృష్టిస్తున్నారు – మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్.

Sakshitha news

వైసిపి వాళ్లు ఓటమి భయంతోనే గొడవలు స్పృష్టిస్తున్నారు – మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్.

జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉయ్యూరు రూరల్ మండలం పెదవోగిరాల గ్రామంలో వైసిపి వాళ్లు టిడిపి కార్యకర్తలపై దాడులు చేయడంతో,, రాజేంద్ర ప్రసాద్ పెదవోగిరాల గ్రామానికి వెళ్లి అక్కడ పరిస్థితులను సమీక్షించి, కార్యకర్తలతో చర్చించి, వాళ్లకి ధైర్యం చెప్పిన అనంతరం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న బాధితుడు ఏసుబాబునిపరామర్శించిన రాజేంద్రప్రసాద్ మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు .

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…

మొన్న జరిగిన కార్పోరేషన్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీల రిజల్ట్స్ చూసి వైసీపీ నాయకులు ఓటమి భయంతో, ఈర్ష అసూయ ద్వేషాలతో, ప్రస్తుతం గ్రామాల్లో లేనిపోని గొడవలు, పోలింగ్ కేంద్రాల వద్ద సృష్టిస్తున్నారని, సౌమ్యంగా ఉన్న టిడిపి నాయకులపై దాడులకు దిగుతున్నారని, పెదవోగిరాల గ్రామంలో మా టిడిపి కార్యకర్తలపై దాడులు చే సి, దారుణంగా కొట్టి గాయపరచడాన్ని, తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులపై తగు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నామని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు…

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.