అధిక ధరలకు బియ్యం అమ్మే వారిపై చర్య తీసుకోవాలి.సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్ డిమాండ్.

Sakshitha news

అధిక ధరలకు బియ్యం అమ్మే వారిపై చర్య తీసుకోవాలి.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్ డిమాండ్.

ఎల్ నినో అనే కారణాన్ని చూపి గత కాలంలో పండిన పంట నుండి వచ్చిన బియ్యము అప్పటి రేటు ప్రకారం అమ్మకుండా దిగుబడి తక్కువ ఉందని ప్రచారం చేసి బియ్యం ను అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఇది ముమ్మాటికి ప్రజలను మోసం చేయడమేనని కావున అధిక ధరలకు అమ్మే వ్యాపారస్తుల పై చర్యలు తీసుకోవాలని నేడు సిపిఐ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్టలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ మరియు రాష్ట్ర సమితి సభ్యులు ఏసురత్నం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బియ్యంను నిర్ణయించిన ధరలకే అమ్మాలని నిన్న చేసిన ప్రకటనను సిపిఐ గా స్వాగతిస్తున్నామని కానీ బియ్యం అమ్మే వ్యాపారస్తులు విజిలెన్స్ అధికారులు ఎక్కడ దాడి చేస్తారోనని సాయంత్రం వేళ అధిక ధరలకు అమ్ముకుంటూ ఉదయం సమయంలో షాపులు మూసివేసి ఉంచుతున్నారని కావున అధికారులు వారిపై నిరంతర నిఘాను ఏర్పాటు చేసి అధిక ధరలకు అమ్మే వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు రేషన్ మరియు నిత్యవసర వస్తువులను అమ్మితే అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుందని ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బియ్యం బ్లాక్ మార్కెట్ చేసిన వారి పైన కేసు నమోదు చేయాలని సిపిఐ గా బ్లాక్ మార్కెట్ దందాలపై కూడా దాడులు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ రాష్ట్ర సమితి సభ్యులు కే ఏసురత్నం మండల సహాయ కార్యదర్శి హరినాథ్ రావు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ప్రజానాట్య మండల అధ్యక్షుడు బాబు, ఏ ఐ వై ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు ప్రవీణ్ కీర్తి సిపిఐ నాయకులు జానకిరామ్ ఇమామ్ ,నారాయణ, నరసింహ మరియు ప్రవీణ్లు పాల్గొన్నారు.