బేతుపల్లి చెరువు ఘటనపై మంత్రి పొంగులేటి నిరంతర పర్యవేక్షణ
- కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా..
ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితం.. గంటలోగా ఒడ్డుకు చేర్చేందుకు చర్యలు
ఖమ్మం: సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ప్రవహిస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పరిస్థితిపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం నిరంతరం పర్యవేక్షించారు. మురసు తుపాను ప్రభావంతో చెరువు వద్ద చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ బృందం బోటు తిరగబడిన విషయం తెలుసుకున్న మంత్రి.. వెంటనే కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మంత్రి ఆదేశాలతో కలెక్టర్ దివాకర.టిఎస్, సి పి సునీల్ దత్ ఘటనా స్థలానికి చేరుకుని బుధవారం రాత్రి వరకు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు.. గల్లంతైన సిబ్బంది సమీప ప్రాంతంలో సురక్షితంగా ఉన్నట్లు గుర్తించాయి. వారిని మరో గంటలోగా ఒడ్డుకు చేర్చేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు మంత్రికి వివరించారు. సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకునే వరకు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
