కూకట్‌పల్లి నుంచి భారీగా తరలివెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు
ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ‘ఓటు బచావో – దేశ్ బచావో’ సభలో పాల్గొన్న బండి రమేష్
న్యూఢిల్లీ, :
ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ, INDIA కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటు బచావో – దేశ్ బచావో’ భారీ బహిరంగ సభకు TPCC ఉపాధ్యక్షులు, తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ నాయకత్వంలో కూకట్‌పల్లి నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లి ఉత్సాహంగా పాల్గొన్నారు.
లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ నాయకత్వంలో, TPCC అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ తో పాటు పలువురు ముఖ్య నాయకుల సమక్షంలో జరిగిన ఈ సభలో కూకట్‌పల్లి కాంగ్రెస్ శ్రేణులు ‘ఓటు చోరీని అడ్డుకుందాం – ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం’, ‘ఓటు బచావో – దేశ్ బచావో’ అంటూ నినాదాలు చేస్తూ తమ సంఘీభావాన్ని చాటుకున్నాయి.
పార్టీ అధిష్ఠానం పిలుపునకు స్పందించి భారీ సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కుల సంరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి తమ మద్దతును ప్రకటించాయి.
ఓటు మన హక్కు – ప్రజాస్వామ్యం మన బాధ్యత!
ఓటు చోరీని అడ్డుకుందాం – దేశ్ బచావో!


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
