అనంతగిరి మండల రహదారుల అభివృద్ధికి రూ.2.80 కోట్లు మంజూరు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన అనంతగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముసుకు శ్రీనివాస్ రెడ్డి
అనంతగిరి: కోదాడ నియోజకవర్గంలోని అనంతగిరి మండలంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.2.80 కోట్ల నిధులు మంజూరు కావడం పట్ల అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముసుకు శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
మండలంలోని మీట్యా తండా నుంచి వసంతాపురం సీఏడీ రోడ్డు వరకు రహదారి నిర్మాణానికి రూ.1.30 కోట్లు, పాలారం నుంచి పాలేరు వాగు వరకు రహదారి నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరు కావడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.
ఈ నిధుల మంజూరుకు ప్రత్యేక చొరవ చూపిన రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, కోదాడ ఎమ్మెల్యే నల్లమాద పద్మావతి రెడ్డి కి అనంతగిరి మండల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST