వర్ధన్నపేట మండల గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ప్రకటన

Sakshitha news

వర్ధన్నపేట మండల గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ప్రకటన

గ్రామస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా నూతన అధ్యక్షుల నియామకం

వర్ధన్నపేట మండలంలోని వివిధ గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు , వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్ ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రజలకు కాంగ్రెస్ పార్టీని మరింత చేరువ చేయడంలో గ్రామ అధ్యక్షులు కీలక పాత్ర పోషించాలని వారు సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.నూతనంగా నియమితులైన గ్రామ అధ్యక్షులు పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని వారు ఆకాంక్షించారు.గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ ప్రతిష్ఠను పెంపొందించాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు , డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్ సూచించారు.