సైబరాబాద్ కమీషనరేట్ పరధిలోని బాలానగర్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం బాలానగర్ ఏసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా కూకట్ పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ ఐపీస్ ముఖ్యధితిగా హాజరై పాల్గొన్న సిబ్బందికి బహుమతులు అందజేశారు.
బతుకమ్మ వేడుకలలో బాలానగర్, అల్లాపూర్, కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ మహిళా సిబ్బంది హాజరై పూలతో బతుకమ్మను తీర్చిదిద్ది, చుట్టూ చేరి సాంప్రదాయ బతికమ్మా పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, కోలాటం ఆడుతూ, బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ పండుగను జరిపారు.
ఈ కార్యక్రమంలో సిఐలు ప్రశాంత్, స్వామి గౌడ్, నవీన్, ఎస్ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
