తిరుపతి మేయర్ అభ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున నీరుగట్టు నగేష్
తిరుపతి
తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నీరుగట్టు నగేష్ ను నిలబెడుతున్నట్టు రాష్ట్ర కన్వీనర్ శీరా రమేష్ కుమార్ ఆదేశాలతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి బాలసుబ్రమణ్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచలపతి తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రకటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమాల నుండి అనేక పోరాటాలు నిర్వహించి, పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టి 2014 లో తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో మా ఆదర్శ నాయకుడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రివర్యులు, పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రేరణతో రాజకీయాల్లో ప్రవేశించి, అనాడు 7280 ఓట్లు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.
అనతి కాలంలో తిరుపతి జిల్లాలో జిల్లా అధ్యక్షులుగా బాధ్యత చేపట్టిన నీరుగట్టు నగేష్ అనేక ప్రజా పోరాటాలు, స్థానిక సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరిగిందన్నారు.
ముఖ్యంగా తిరుపతిని మోడల్ సిటీగా చేయడం కోసం, అవినీతి నిర్మూలన కోసం, పారదర్శక పాలన అందించడం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మేయర్ అభ్యర్థిగా పోటిచేస్తున్న నీరుగట్టు నగేష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో మేయర్ అభ్యర్థి స్థానాన్ని ఖరారు చేసిన ఆప్ పార్టి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తిరుపతి ప్రజలు, యువత విద్యార్థులు, మహిళలు, మేధావులు, కార్మికులు మార్పు కోరుకునే ప్రతి పౌరుడు చీపురుగుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని, నా ద్వారా తిరుపతి నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని తెలిపారు. తిరుపతిలోని వివిధ వార్డులో పోటీ చేయాలనుకున్నటువంటి ఆసక్తి కలిగిన వారు వాట్సాప్ 9492820119 కు బయోడేటా పంపి జీరో పాలిటిక్స్ జీరో రుపీతోనే పోటీ చేయవచ్చని తెలియజేశారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
