శంషిగూడ మరియు హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్‌ఎంటీ శాతవాహన నగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన దుకాణాలు మరియు సిబ్బంది వసతి గృహాన్ని తాజా మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాస రావు , ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ హెచ్‌ఎంటీ శాతవాహన నగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన దుకాణాలు మరియు సిబ్బంది వసతి గృహాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని, సిబ్బంది కి వసతి కల్పించడం గొప్ప విషయం అని, నేటితో అందుబాటులోకి రావడం జరుగుతుంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంటీ శాతవాహన నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులైన అధ్యక్షులు పి. రత్న ప్రసాద్ , ఉపాధ్యక్షులు ఎం. బాబు రావు , ప్రధాన కార్యదర్శి ఎం. యాది రెడ్డి , కార్యనిర్వాహక కార్యదర్శులు వి. వెంకట రావు మరియు ఎస్. రామనాధం తో పాటు, హెచ్‌ఎంటీ శాతవాహన నగర్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు మరియు శ్రీ ఉమా మహేశ్వర ఆలయ కార్యవర్గ సభ్యులు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
