దుండిగల్ డివిజన్ K.V.R. వ్యాలీ మెయిన్ రోడ్డులో రూ.46 లక్షల CMC నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ డివిజన్, K.V.R. వ్యాలీ మెయిన్ రోడ్డులో నెలకొన్న రహదారి సమస్యలను స్థానికులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో, ఆయన ప్రత్యేక చొరవతో CMC నిధుల నుంచి రూ.46 లక్షలు మంజూరయ్యాయి.
ఈ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు సంగొల్ల మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయాలు కల్పించడంతో పాటు, దుండిగల్ డివిజన్‌లో మౌలిక వసతులను అభివృద్ధి చేసి, ప్రాంత సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అమరం ముత్యం రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జక్కుల మల్లేష్ యాదవ్, కొలన్ జీవన్ రెడ్డి, మాజీ సర్పంచ్ కావలి గణేష్, నిజాంపేట్ సర్కిల్ డివిజన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు బోట్ల విజయ్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిసరి మహేందర్ రెడ్డి, మనోజ్, సురేష్, లక్ష్మారెడ్డి, గురువారెడ్డి, మనోహర్, గోపాల్ పద్మారావు, ఆకుల ప్రేమ్ కుమార్, మల్లంపేట్ ప్రకాష్, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
