కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు వెళ్దాం

Sakshitha news

కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు వెళ్దాం
……………………………………
అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధి కూటమి పార్టీల నేతల సమన్వయ కమిటీ సమావేశం తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం కార్యాలయంలో జరిగింది. మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఇంచార్జ్ మంత్రులు కింజారపు అచ్చం నాయుడు , గుమ్మడి సంధ్యారాణి అధ్యక్షతన అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ పరిధిలో జనసేన పార్టీ, తెలుగుదేశం, బిజెపిల నుంచి శాసనసభ్యులు/ నియోజకవర్గ ఇన్చార్జులు/POCలలతో ఈ సమావేశం నిర్వహించారు. మూడు పార్టీ వారు సమిష్టిగా పనిచేసి విజయం సాధించే అవకాశాలు ఉన్న స్థానాలను వివరాలు పార్టీలకు పంపిస్తే అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుంది.

కాబట్టి అభ్యర్థులు ఎంపికపై ఏ ఒక్కరూ వ్యక్తిగత ప్రకటనలు చేయొద్దని, అభ్యర్థుల గురించి చర్చించడం గాని చేయొద్దని ఈ సమావేశం తీర్మానించడం జరిగింది. నియోజకవర్గస్థాయిలో ఇన్చార్జిలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది. ఎటువంటి అరమరికులు లేకుండా కూటమి అభ్యర్థుల గెలుపునకే అందరం ఐక్యంగా పనిచేయాలని అభ్యర్థి టిడిపియా, జనసేనా , బిజెపినా అనే విషయాన్ని పక్కనపెట్టి గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్న దానిపై ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ తరఫున పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ , పాడేరు ఇన్చార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య , రంపచోడవరం POC కుర్ల రాజశేఖర్ రెడ్డి , సేగ్గే భావన సాయి , అరకు POC శెట్టి చిరంజీవి , పార్వతీపురం POC ఆదాడ మోహన్రావు తదితరులు హాజరయ్యారు