కేరళం రాష్ట్ర పర్యటనలో ఉన్న ఏపీ విద్య ,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్

Sakshitha news

కేరళం రాష్ట్ర పర్యటనలో ఉన్న ఏపీ విద్య ,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కిటెక్స్ గార్మెంట్స్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సబు ఎమ్. జాకబ్‌ను కొచ్చిలో కలిశారు. ఈ సందర్భంగా టెక్స్‌టైల్, దుస్తుల రంగం, తయారీ అవకాశాలు, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధిపై చర్చించారు. ఏపీలో ఉన్న అవకాశాలను పరిశీలించి, అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామ్యమవ్వాల్సిందిగా కిటెక్స్ సంస్థను మంత్రి ఆహ్వానించారు. జాకబ్ ఆహ్వానం మేరకు కొచ్చిలోని కిటెక్స్ ఫ్యాక్టరీని మంత్రి లోకేష్ సందర్శించారు.