కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్. పార్టీ విస్తృత స్థాయి సమావేశం

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్. పార్టీ విస్తృత స్థాయి సమావేశం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్. పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరియు గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన సదస్సు ఉదయం 10:30 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం, గండిమైసమ్మలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శంభిపూర్ రాజు , ఎమ్మెల్సీ, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, కె.పి. వివేకానంద్ , ఎమ్మెల్యే, బి.ఆర్.ఎస్.ఎల్.పి. విప్ హాజరు కావడం జరిగింది.

ఈ సమావేశం 292 డివిజన్ సాయిబాబా నగర్ BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో డివిజన్ నాయకులు పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.