డాక్టర్ దశరథ్ ఎంఎస్‌కు అరుదైన గౌరవం..

Sakshitha news

డాక్టర్ దశరథ్ ఎంఎస్‌కు అరుదైన గౌరవం..

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా డైరెక్టర్‌గా నియామకం..


సాక్షిత : సూర్యపేట జిల్లా/కోదాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌, సీనియర్ సర్జన్‌, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ దశరథ్ ఎంఎస్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా డైరెక్టర్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు రెడ్‌క్రాస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నియామకంపై జిల్లా వ్యాప్తంగా వైద్యులు, రెడ్‌క్రాస్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ దశరథ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.వైద్య రంగంలో సీనియర్ సర్జన్‌గా విశేష అనుభవం ఉన్న డాక్టర్ దశరథ్.. ప్రభుత్వ వైద్య సేవలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. కోదాడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆస్పత్రిలో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, రోగులకు మెరుగైన వైద్య సేవల అందించడంలో కీలకంగా పనిచేస్తున్నారు. కరోనా విపత్కర సమయంలోనూ ప్రాణాలకు తెగించి ప్రజలకు వైద్య సేవలు అందించారు.నిరుపేదలకు ఉచిత వైద్యం, రక్తదాన శిబిరాలు, అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాల నిర్వహణలో ఆయన సేవలు ప్రశంసలు అందుకున్నాయి. ఇదే సమయంలో కోదాడకు చెందిన సామాజిక కార్యకర్త కొమరగిరికి కూడా రెడ్‌క్రాస్ డైరెక్టర్ పదవి లభించింది.ఈ సందర్భంగా డాక్టర్ దశరథ్ ఎంఎస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రెడ్‌క్రాస్ సొసైటీకి కృతజ్ఞతలు తెలిపారు. రెడ్‌క్రాస్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత చేరువగా పనిచేస్తానని పేర్కొన్నారు.

కొమరగిరి రంగారావుకి రెడ్‌క్రాస్ డైరెక్టర్‌గా బాధ్యతలు

కోదాడ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త కొమరగిరి రంగారావుకి కూడా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ డైరెక్టర్‌గా నియామకం లభించింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఆయన సేవలను గుర్తించిన రెడ్‌క్రాస్ సొసైటీ ఈ బాధ్యతలను అప్పగించింది. నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం వంటి కార్యక్రమాల్లో కొమరగిరి విశేషంగా సేవలందిస్తున్నారు. ఆయనకు డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించడంపై పలువురు అభినందనలు తెలిపారు.