వైసీపీకి ప్రజలే బలం

Sakshitha news

వైసీపీకి ప్రజలే బలం

రాష్ట్రంలో శాంతిభద్రతులు లేవు

గ్రామాలలో ఎక్కడపడితే అక్కడ మద్యం

రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతున్న చంద్రబాబు

బుచ్చి మున్సిపాలిటీ భవనంపై వైసీపీ జెండా ఎగురవేస్తాం

కోవూరు వైసిపి విస్తృతస్థాయి సమావేశంలో నల్లప రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి..

కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు లేవు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతున్న చంద్రబాబు కోవూరు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. కోవూరులో పాటూరు రోడ్డు రాజరాజేశ్వరి గుడి వెనక కోవూరు మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా వైసిపి కార్యకర్తలకు ఐడీ కార్డులు ఇవ్వడం జరిగింది. జడ్పిటిసి, ఎంపీటీసీలకు పదవీకాలం ముగుస్తున్నందున వారికి చిరు సత్కారం చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాలలో మద్యం అడ్డు అదుపు లేకుండా ఏరులై పారుతుందని, తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతున్నారని, ఈ అప్పులో సగం తండ్రీ కొడుకులు కాంట్రాక్టుల కమిషన్లకువారు వినియోగించారన్నారు.

స్థానిక శాసన సభ్యురాలు మా అక్క ప్రశాంతి రెడ్డి నా గురించి చాలానే మాట్లాడారు.గత ఐదేళ్లలో కోవూరులో సంక్షేమం అభివృద్ధి పథకాలు ఎన్నడూ లేనివిధంగా చేశామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటుదాం. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ భవనంపై వైసీపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు. వైసిపి గెలుపుకు నాయకులు కార్యకర్తలు చిన్న చిన్న మనస్పర్ధలు వీడి, సమిష్టిగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వీరి చలపతిరావు, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, కొండూరు అనిల్ బాబు, శివుని నరసింహులు రెడ్డి, గొల్లపల్లి విజయ్ కుమార్, రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, కాటంరెడ్డి దినేష్ రెడ్డి, హరి ప్రసాద్ రెడ్డి, కవర గిరి శ్రీలత, ఎడం లక్ష్మి కుమారి, కూట్ల ఉమా శ్రీనివాస్ రావు, గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి, తోడేటి మహేష్, గుణ్ణం జనార్దన్, ప్రజా ప్రతినిధులు వైసిపి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.