కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ని కలిసి ప్రజలు..

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ని కలిసి ప్రజలు..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గానికి చెందిన ప్రజలు, కాలనీ సభ్యులు, నాయకులు, అభిమానులు పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు వారు సానుకూలంగా స్పందించారు. వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టి అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కె.పి వివేకానంద దృష్టికి తీసుకెళ్లి వారి సహాయ సహకారాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.. పలు శుభ కార్యక్రమాలలో, వినాయక చవితి సందర్భంగా ఉత్సవాల్లో పాల్గొనాలని పలువురూ ఆహ్వానించారు..

అదే విధంగా దుండిగల్ శివాజీ వ్యాయామశాల ముదిరాజ్ సంఘం యూత్ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను వారు అభినందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అభివృద్ధికి, యువత ఐక్యతకు నూతన కమిటీ మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. యువత క్రీడలు, వ్యాయామం మరియు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జక్కుల శ్రీనివాస్ యాదవ్, మాజీ ప్యాక్స్ డైరెక్టర్ ఈ.శ్రీనివాస్, నూతన ప్రెసిడెంట్ ఉప్పరి శివ భార్గవ్, వైస్ ప్రెసిడెంట్ కొరివి శ్రీకాంత్, జనరల్ సెక్రెటరీ తంబలి సతీష్, కోశాధికారి వేణు, సభ్యులు నాగరాజు, శివ, నవీన్, రాజు, ప్రకాష్, దత్తు, అరుణ్, అభి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.