నిరసనను కెమెరాలో చూపించడం లేదని.. కెమెరాకే నేరుగా సందేశం

Sakshitha news

నిరసనను కెమెరాలో చూపించడం లేదని.. కెమెరాకే నేరుగా సందేశం ఇచ్చిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు !

శాసనమండలిలో తమ నిరసనను కెమెరాల్లో చూపించడం లేదని.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వినూత్నంగా నిరసన తెలిపారు.

ఎమ్మెల్సీ చింతపండు నవీన్ మాట్లాడుతున్న సమయంలో పక్కనే కూర్చొని, జేబులో నుంచి పేపర్ తీసి కెమెరాకు కనిపించేలా చూపిస్తూ—

బామ్మర్దికి అమృత్ టెండర్లు
తమ్ముడికి రావిర్యాల భూములు
రైజింగ్ అనుముల ఫ్యామిలీ

అంటూ నిరసన వ్యక్తం చేశారు.

నిరసన కెమెరాలో కనిపించగానే.. వెంటనే కెమెరాను అటువైపు నుంచి తిప్పేసిన మండలి సిబ్బంది!

కెమెరాలు తిప్పినా.. బీఆర్ఎస్ ప్రశ్నించే గొంతుకను మాత్రం ఆపలేరు!