BJYM ఆధ్వర్యంలో “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” నిరసన దీక్ష
40 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, భారతీయ జనతా యువ మోర్చా (BJYM) ఆధ్వర్యంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని IDPL చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ నిరసన దీక్షలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని, తమకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దీక్షకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు రూ.15 వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెండింగ్‌లో ఉండటం అత్యంత దురదృష్టకరమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడకుండా, పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేదంటే పోరాటాన్ని ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ నిరసన దీక్షలో గిరివర్ధన్ రెడ్డి తో పాటు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు శేఖర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు గరిగె శేఖర్, వేణు, మహిళా నాయకురాళ్లు విజయలక్ష్మి, మాధురి తదితరులు దీక్షలో పాల్గొన్నారు.
కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవి,మాజీ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, జిల్లా సర్ ఇన్‌చార్జ్ నందనం దివాకర్, పార్లమెంట్ మాజీ కన్వీనర్ ఆర్.కే. శ్రీనివాస్, ఉప్పల్ సర్ కన్వీనర్ గోపాల్ గౌడ్,కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లేష్ యాదవ్, గిరిజన మోర్చా అధ్యక్షులు వెంకటేష్ నాయక్, నాయకులు
రాజా సదానందం, క్రిష్ణారెడ్డి, కట్టా కుమార్ జిల్లాలో డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొని నిరసన దీక్షకు మద్దతు తెలిపారు.
విద్యార్థుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బిజెవైఎం జిల్లా అధ్యక్షులు శ్రీనాథ్, నాయకులు శ్యామ్,పృథ్వి, ఆదిత్య డిమాండ్ చేశారు.
ఫీజు బకాయిల విడుదల కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST