వెంకటపాలెంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నారా లోకేష్ ఘన నివాళులు
రాజధానిలోని వెంకటపాలెంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మహానేత, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ సేవలను, ఆయన అందించిన ప్రజా సేవా స్ఫూర్తిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ,పలువురు మంత్రులు ,ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
అనంతరం నారా లోకేష్ తో పాటు నాయకులు అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
