పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుంది.. సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి….
–కమిషనర్ అంబర్ కిశోర్ ఝా…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : పోలీసు శాఖలో అప్పగించిన బాధ్యతలను అధికారులు సమర్థవంతంగా, నిబద్ధతతో నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు.
ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల ఏఆర్ ఎస్ఐలుగా పదోన్నతి పొందిన టీ. మోహన్, ఎస్. సత్తయ్యలు పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ వారి భుజాలపై పదోన్నతి చిహ్నాలను అలంకరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పదోన్నతి అనేది మరింత బాధ్యతతో కూడిన అవకాశం అని పేర్కొన్నారు. విధుల్లో ఎల్లప్పుడూ నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తూ పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఉన్నతాధికారుల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా విధులు నిర్వహించాలని తెలిపారు.
పదోన్నతి పొందిన అధికారులు తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, రమేష్, ఆర్ఐలు దామోదర్, రమేష్, ఆర్ఎస్ఐ పోచలింగం, సీసీ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
