విద్యార్థుల భద్రతకు పెద్దపీట.. సింగరేణి స్కూల్‌కు నూతన బస్ ప్రారంభం….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : విద్యార్థుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యమిస్తూ సింగరేణి స్కూల్‌కు నూతన స్కూల్ బస్‌ను అందించడం అభినందనీయమని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు.
గోదావరిఖని ఆర్టీసీ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో సింగరేణి స్కూల్‌కు స్పాన్సర్ చేసిన నూతన స్కూల్ బస్‌ను సెక్టర్-2లోని సింగరేణి స్కూల్ ఆవరణలో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠశాలకు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు ఈ బస్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని విధాలుగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అండగా ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థులు అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
సింగరేణి స్కూల్‌కు నూతన స్కూల్ బస్‌ను స్పాన్సర్ చేసిన గోదావరిఖని ఆర్టీసీ డిపో మేనేజర్‌ను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్, స్థానిక కార్పొరేటర్ కాల్వల పద్మావతి, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
