ఎమ్మెల్యే స్పందనతో వెలిగిన భరత్‌నగర్–పీకే రామయ్య కాలనీ ప్రధాన రహదారి….
ప్రజా సమస్యపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌కు కార్పొరేటర్ విజయ్-మల్లేష్ కృతజ్ఞతలు….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 1వ డివిజన్ భరత్‌నగర్ నుంచి పీకే రామయ్య కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిపై గత కొన్ని రోజులుగా వెలగని స్ట్రీట్ లైట్ల సమస్యకు పరిష్కారం లభించింది. సమస్యను కార్పొరేటర్ మడిపెల్లి విజయ్ మల్లేష్ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లడంతో మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి బుధవారం సాయంత్రం వీధిదీపాలను పునరుద్ధరించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయ్ మల్లేష్ మాట్లాడుతూ ప్రధాన రహదారిపై రాత్రి వేళల్లో వీధిదీపాలు వెలగకపోవడంతో ప్రజలు, పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. చీకటి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో సమస్యను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
సమస్యను తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే సంబంధిత మున్సిపల్ అధికారులతో మాట్లాడి స్ట్రీట్ లైట్లను వెంటనే ఏర్పాటు చేయించారని విజయ్ మల్లేష్ తెలిపారు. ప్రజా సమస్యపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌తో పాటు మున్సిపల్ అధికారులకు 1వ డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
