కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి…
మంథనిలో సీపీఐ ప్రజా చైతన్య పాదయాత్ర విజయవంతం…
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై సీపీఐ నేతల ఆగ్రహం….
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, మంథని/
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా చైతన్య పాదయాత్ర విజయవంతమైంది.
మంథని సెంటినరీ కాలనీ మీదుగా 8 ఇంక్లైన్ కాలనీలోని షిర్క్ బస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర తెలంగాణ చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం అక్కడ సభ నిర్వహించారు. సీపీఐ మంథని మండల కార్యదర్శి కందుకూరి రాజారత్నం అధ్యక్షతన జరిగిన సభకు సీపీఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తాండ్ర సదానందం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు. కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
ప్రజా చైతన్య యాత్రలో గౌతం గోవర్ధన్, గోసిక మోహన్, కోడెం స్వామి, కన్నెబోయిన కనకరాజ్, తాళ్లపల్లి మల్లయ్య, కన్నం లక్ష్మీనారాయణ, ఎజ్జ రాజయ్య, ఆరేపల్లి మానస, నవీన్, జుల మోహన్, అసలా రమ తదితరులు పాల్గొన్నారు. యాత్రలో పాల్గొన్న నాయకులను ఆర్జీ-2 బ్రాంచ్ నాయకులు శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్, సీపీఐ మండల కార్యదర్శి కందుకూరి రాజారత్నం, ఆర్జీ-2 బ్రాంచ్ కార్యదర్శి గంధం సాంబశివరావు, సహాయ కార్యదర్శి శ్యాంసన్, ఓసీపీ-3 పిట్ సెక్రటరీ మోటపలుకుల మహేందర్, సీఎచ్‌పీ పిట్ సెక్రటరీ సెగ్గం శంకర్, వకీల్‌పల్లి పిట్ సెక్రటరీ బొంత రాజు, ఏడబ్ల్యూఎస్ పిట్ సెక్రటరీ తాళ్లపల్లి నారాయణ, పుల్లయ్య, మదన్ మోహన్, కడారి లింగయ్య, జాడి ఆంజనేయులు తదితర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
