మీ భూమి మీ హక్కు
రైతన్నలకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.
రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు కోవూరులో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఇటుక పట్టి ఇలా కార్మికులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. డెల్టా ప్రాంతమైన కోవూరులో గత ప్రభుత్వంలో రిసర్వే లో అవకతవకులు జరిగాయని అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాల కోసం రైతులు ఇబ్బంది పడ్డారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ల్యాండ్ యాక్ట్ ను రద్దుచేసి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడంజరుగుతుందన్నారు.కోవూరులో939మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అదేవిధంగా 50 మంది ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులకు నివేశస్థలాల పట్టాలను పంపిణీ చేసామన్నారు.
ఇప్పటివరకు కోవూరులో 5554 ఎకరాలకు రీ సర్వే చేసి పూర్తి చేసాము అందులో 3,917 ఎకరాలకు గాను 939 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశామన్నారు గత ప్రభుత్వంలో కొడవలూరు మండలంలో రిసర్వేలు తప్పిదం వల్ల 400 ఎకరాలు ప్రభుత్వ భూమిగా నమోదయిందన్నారు ఈ సమస్యను జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికార దృష్టికి తీసుకెళ్లామని త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రానున్న రోజుల్లో డెల్టా ప్రాంతంమైన కోవూరులో నీ రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సుబ్బయ్య ,టిడిపి మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, తాటిపర్తి విజయ్ కుమార్ రెడ్డి, జెట్టి మదన్ రెడ్డి, బీద భాస్కరరావు, పాలూరు వెంకటేశ్వర్లు, బాల రవి, జనసేన నాయకులు చప్పిడి శ్రీనివాస్ రెడ్డి బిజెపి నాయకులు పోలిశెట్టి సుబ్బారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
