ఆషాడ మాస బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ .
షాపూర్ నగర్ వెజిటబుల్ మార్కెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో షాపూర్ మార్కెట్ సమీపంలోని నల్ల పోచమ్మ తల్లి ఆలయంలో ఆషాడ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ హాజరై పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. పోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
అనంతరం షాపూర్ మార్కెట్ కమిటీ సభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు కూన రాఘవేందర్ గౌడ్, కమిటీ సభ్యులు గుమ్మడి వెంకటేష్, షేక్ అజ్జు, రవి, నాని, మరియు జగన్, విజయ్, ప్రభాకర్ రెడ్డి ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
