మండలంలో బలమైన నాయకురాలిగా కాసాని పద్మక్క
అశ్వారావుపేట అంతా “పద్మ అక్క” గురించే చర్చ
పదవి కన్నా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన కాసాని పద్మక్క బిఆర్ఎస్ పార్టీకి వెన్నుదండగా నిలిచిన మహిళా శక్తి
అశ్వారావుపేట సాక్షిత
అశ్వారావుపేట మండల రాజకీయాల్లో బలమైన నాయకురాలిగా కాసాని పద్మక్క ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బిఆర్ఎస్ పార్టీకి వెన్నుదండగా నిలిచి, పార్టీని బలోపేతం చేస్తున్న మహిళా నాయకురాలిగా ఆమె పేరు మారుమోగుతోంది.
“మాట ఇస్తే తప్పని వ్యక్తిత్వం” అనేదే ఆమెకున్న పెద్ద ఆస్తి. ఇచ్చిన మాట కోసం అసాధారణంగా పనిచేసి ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. కార్యకర్తకు అండగా, ఆపదలో భరోసాగా నిలిచే నాయకురాలిగా ఆమెకు మంచి పేరుంది.
చిన్నవారి నుంచి పెద్దవారి వరకు “పద్మ అక్క” అంటే తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. పద్మ అక్క అంటే ఒక బ్రాండ్. పద్మ అక్క అంటే ఒక చరిత్ర అని ప్రజలు చెప్పుకుంటున్నారు.
పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు గౌరవించే వ్యక్తిత్వం ఆమె సొంతం. ప్రజా సమస్యలపై పోరాడడంలో, ప్రభుత్వంపై నిలదీయడంలో ఆమెది ముందు వరుస.
మండలంలో ఏ చిన్న సమస్య వచ్చినా “పద్మ అక్కకు చెప్దాం” అనే పరిస్థితి నేడు నెలకొంది. ఇదే ఆమె బలానికి, ప్రజాదరణకు నిదర్శనం. ప్రస్తుతం మండలంలో ఆమె గురించే చర్చ జరుగుతోంది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
