మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ నీ ను మర్యాదపూర్వకంగా కలిసిన పూజిత ఎన్క్లేవ్ నూతన కార్యవర్గం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ: నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని బండారి లేఔట్ డివిజన్లో ఉన్న పూజిత ఎన్క్లేవ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను షాపూర్‌నగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి, శాలువాతో సన్మానించారు. పూజిత ఎన్క్లేవ్ కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. కాలనీకి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తరఫున తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు విద్యాసాగర్‌తో పాటు కార్యవర్గ సభ్యులందరికీ శ్రీశైలం గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని పలువురు శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు అందజేసి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు..
ఈ కార్యక్రమంలో పూజిత ఎన్క్లేవ్ మాజీ అధ్యక్షుడు శరత్, అమర్, బెనర్జీ, రాజు, నరేంద్ర, వెంకట్ రాజు, శ్రీనివాస్ రెడ్డి, ఉదయ్, శివారెడ్డి, శ్రీనివాసులు, రణధీర్, అరవింద్, యాదగిరి, ఏ.కె. రావు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
