మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎన్నికైన SR నాయక్ నగర్ నూతన కమిటీ సభ్యులు
కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ని సుభాష్‌నగర్ డివిజన్ పరిధిలోని SR నాయక్ నగర్ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు షాపూర్‌నగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన బాబీ మరియు కార్యవర్గ సభ్యులు కాలనీలో నెలకొన్న పలు సమస్యలను మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
దీనిపై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ స్పందిస్తూ, కాలనీల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అవసరమైన నిధులు మంజూరు చేయించి, కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో SR నాయక్ నగర్ మాజీ అధ్యక్షులు గోగినేని శ్రీనివాసరావు , టి బాబి(సాయి చరణ్) అధ్యక్షులు, కిషోర్ రవిచంద్రన్ జనరల్ సెక్రెటరీ, వై ప్రదీప్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్, నాగ శిరోమణి ఆర్గనైజింగ్ సెక్రెటరీ, వర్మ ట్రెజరర్, జి ఎస్ కిషోర్ వైస్ ప్రెసిడెంట్, రాఘవేంద్రరావు జాయింట్ సెక్రెటరీ, ఆర్ సురేష్ నాయక్ జాయింట్ సెక్రెటరీ, చంద్రకాంత్ జాయింట్ సెక్రెటరీ, భాగ్య రావు జాయింట్ సెక్రెటరీ, యూనస్, మాల్యాద్రి మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
