జైరాం నగర్లో నూతన బోర్వెల్ ప్రారంభోత్సవం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ (కుత్బుల్లాపూర్ డివిజన్) పరిధిలోని జైరాం నగర్లో ఎంపీ లాడ్స్ (MPLADS) నిధుల ద్వారా మంజూరైన నూతన బోర్వెల్ను నేడు ప్రారంభించి, బస్తీ వాసులకు స్వచ్ఛమైన నీటి సౌకర్యం కల్పించేందుకు ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు చేసిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నూతన బోర్వెల్ అందుబాటులోకి రావడంతో జైరాం నగర్ బస్తీ వాసులకు నీటి సౌకర్యం మెరుగుపడనుందని పేర్కొంటూ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని బస్తీ వాసులకు తెలియజేసిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు మల్లేష్, శ్రీనివాస్ రెడ్డి, బాబీ నీలా, కృష్ణవేణి, శ్రీనివాస్, ఉపేందర్, నర్సింహా, నరేష్, సరోజినీ, గడ్డం వెంకటేష్, బాలమణి, రమేష్, నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్, నల్లనాగుల కృష్ణ, పెద్దింటి సాయిలు, బాసుపల్లి సందీప్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, పోల గంగాధర్, సతీష్ చక్రవర్తి, శ్రవణ్ బోస్, దీపిక, శ్రవణ్, వర్మ, శివ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
